వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని 10 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీకి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా శ్రీరామ్ రామచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, ఎండి హుస్సేన్ పాషా, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల్ల సోమేశ్వరరావు, పెద్దపల్లి వరప్రసాద్, బొడిగ శ్రీనివాస్, బొల్లెపల్లి రాజు నియమితులయ్యారు.
ఈ కమిటీలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆయుబ్ అలీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అదనంగా దక్షిణ మధ్య రైల్వే, టీజీఎస్ఆర్టీసీ ప్రతినిధులు, సమాచార శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.
కొత్త కమిటీ ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments