నల్లగొండ: తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జిల్లా నాయకుడు చొక్కాల చరణ్ ఆరోపించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు “రైతు భరోసా” పేరుతో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
కొత్త పంట సాగు సమయం ఆసన్నమైనప్పటికీ రైతుల చేతుల్లో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రైతులు తమ ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తూ రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.
“Shame on Congress Government” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చరణ్ ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments