ePaper
Wednesday, May 13, 2026

మానవ హక్కులపై జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు…

మానవ హక్కుల అవగాహన కోసం ఎన్‌హెచ్‌ఆర్‌సీ జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన 12వ జాతీయ స్థాయి “హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్” నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.

దేశవ్యాప్తంగా మానవ హక్కులపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ పౌరుడు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను ఏ భారతీయ భాషలోనైనా రూపొందించవచ్చని, అయితే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

విజేతలకు ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.1 లక్షతో పాటు ప్రత్యేక ప్రస్తావన పొందిన నాలుగు చిత్రాలకు తలా రూ.50 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ పోటీల వివరాలను విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామపంచాయతీల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఎంట్రీలను 2026 జూన్ 30లోగా పంపించాలని సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!