నల్లగొండ, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బీసీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెరికా స్వాతి వినాయక రాజుతో కలిసి మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కుటుంబంలో కీలక భాగస్వాములుగా గుర్తించి, పుట్టింటి నుంచి వచ్చే పట్టుచీరల మాదిరిగా ప్రతి అర్హ మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందించి వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని చెప్పారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెరికా స్వాతి వినాయక రాజు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మేయర్ ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments