నిజామాబాద్ ప్రాంతంలో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో అద్దె ఇంట్లో ఉంటున్న సీఐ, బాధితుడి నుంచి రూ.2 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి రంగేచేత పట్టుకున్నారు.
కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి తరలించేందుకు అనుమతులు ఇవ్వడం, కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సీఐ ఇంటిపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా అతని వద్ద అదనంగా లభించిన రూ.45,670 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments