కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద వరంగల్ నగర అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ ప్రాజెక్టుకు రూ.4,674.6 కోట్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదించింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. వరంగల్-హనుమకొండ-కాజీపేట త్రినగరాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డ్రైనేజీ సమస్యకు ఈ ప్రాజెక్టుతో శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.
తెలంగాణకు మొత్తం మూడు మెగా ప్రాజెక్టులకు రూ.5,681 కోట్లు మంజూరు కాగా, అందులో వరంగల్ ప్రాజెక్టుకే అత్యధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం భారీ గ్రాంట్‌తో పాటు జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (KfW) ద్వారా రుణ సదుపాయాన్ని కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
వరంగల్ నగర రూపురేఖలను మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గంట రవికుమార్ పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments