వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిల్లా వరంగల్ పడమర కోట ప్రాంతానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు స్వర్గీయ నాగవెల్లి వెంకట రాములు గారి సతీమణి నాగవెల్లి కౌసల్య ఇటీవల మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతురాలి కుమారులు నాగవెల్లి చందర్, గౌతమ్ కుటుంబ సభ్యులతో కలిసి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments