ePaper
Tuesday, July 28, 2026

కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి.. వీర కుటుంబాలు, మాజీ సైనికులకు సన్మానం.

చీకటి వెలుగు నల్లగొండ.

27వ కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సైనికులు, వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల స్మారకార్థం రెండు నిమిషాల మౌనం పాటించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన బి. గోపయ్య చారి సతీమణి పి. శారద, మిఠ శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి–మణెమ్మ, లాన్స్ నాయక్ షేక్ ఇమామ్ తండ్రి షేక్ అహ్మద్, అలాగే యుద్ధంలో గాయపడిన శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యర్రమాద శ్రీనివాసులు అమరవీరుల కుటుంబ సభ్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున మాజీ సైనికులు, వీరనారులు కూడా ఘనంగా సత్కరించబడ్డారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కమిటీ సభ్యులు, మాజీ సైనికులు, కార్యాలయ సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షుడు సంది పాపిరెడ్డి, ప్రధాన సలహాదారు కె. వెంకటాచారి, న్యాయ సలహాదారు సంది శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానితులుగా హాజరయ్యారు. జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కత్తి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి సత్యనారాయణ రాజు, కోశాధికారి జి. రాములు, ఉపాధ్యక్షులు కె. కోటేష్, మహ్మద్ అబ్దుల్ సమీర్, సంయుక్త కార్యదర్శులు నల్లగొండ సుధాకర్, బి. లక్ష్మీనారాయణ, ఎం. లింగయ్య, సి.హెచ్.ఎస్. దామోదర్, బండారి నర్సింహం, పాలక మండలి సభ్యులు రామచంద్రయ్య, కేశవులు, ఏచూరి భాస్కర్, అఫీజ్ ఖాన్, కార్యాలయ సిబ్బంది ఎం.డి. అంజద్ షరీఫ్, వి. నర్సింహస్వామి, ససేమ్, శ్రీనివాస్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!