ePaper
Monday, July 27, 2026

ఎస్సీలకు అన్ని ఎన్నికల్లో 15% రిజర్వేషన్ అమలు చేయాలి

చీకటి వెలుగు నల్లగొండ.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు శ్రీ బాకీ నరసింహ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన అన్ని ఎన్నికల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా సిఫారసు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంకురీ నర్సింహ మాట్లాడుతూ ఉద్యోగాలు, విద్యా రంగంలో అమలవుతున్నట్లే స్థానిక సంస్థలు సహా అన్ని ఎన్నికల్లోనూ ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సాధనకు ఇది అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్‌చార్జి వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, సీనియర్ నాయకుడు చింత ముత్యాలరావు, మాజీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు పేరిక మునికుమార్, ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి చినేని జాని, బలరాం, దాసరి ఈశ్వర్, ఉబ్బపల్లి నాగరాజు, చింతపల్లి వెంకన్న, చిత్రం ఉదయ్, గునుగుంట్ల రవి తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!