ePaper
Saturday, September 5, 2026

వరంగల్‌కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ.. ఘన స్వాగతం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పర్యటన సందర్భంగా బుధవారం వరంగల్ ఎన్ఐటీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.

డిప్యూటీ సీఎం, మంత్రికి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు.

అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న తదితరులు డిప్యూటీ సీఎం, మంత్రికి స్వాగతం పలికారు.

ఎన్ఐటీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కొద్దిసేపు సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, జిల్లా అదనపు కలెక్టర్ రవి, డీఆర్వో శ్రీనివాస్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!