ePaper
Saturday, May 30, 2026

టీయూడబ్ల్యూజే–ఐజేయూ హనుమకొండ నూతన కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ అధికారికంగా ప్రకటించారు.

అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, కార్యదర్శిగా ఉట్కూరు సీతారామారావు (సాయి), కోశాధికారిగా పొడిశెట్టి విష్ణువర్ధన్ ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా దండుమోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయభాస్కర్, అల్లె రామారావు ఎన్నిక కాగా, సహాయ కార్యదర్శులుగా జి. బాలరాజు, గన్ను సంతోష్ కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్ పాషా ఎన్నికయ్యారు.

అధ్యక్షుడు, కార్యదర్శి పదవులకు ఎన్నిక జరగ్గా మిగతా కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మొత్తం 407 ఓట్లకు గాను 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు రాగా, ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్‌కు 4 ఓట్లు వచ్చాయి. దీంతో 204 ఓట్ల భారీ మెజారిటీతో కేశవమూర్తి విజయం సాధించారు.

కార్యదర్శి పదవికి పోటీ చేసిన ఉట్కూరు సాయిరాంకు 204 ఓట్లు రాగా, ప్రత్యర్థి మెరుగు రాజేంద్రప్రసాద్‌కు 7 ఓట్లు లభించాయి. 197 ఓట్ల మెజారిటీతో సాయిరాం గెలుపొందారు.

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే ధ్యేయంగా నూతన కమిటీ పనిచేస్తుందని ఎన్నికల అధికారి ఆకాంక్షించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!