ePaper
Saturday, May 30, 2026

నల్లగొండలో బక్రీద్ ఏర్పాట్ల పరిశీలన

నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులను బుధవారం డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్, పలువురు కార్పొరేటర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy సహకారంతో ఈద్గా విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు పనులను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే రేపు జరగనున్న బక్రీద్ పండుగకు ఈద్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమద్, ఇబ్రహీం, ఖలీల్, మొయినా, హాజీ, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!