బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణాన్ని నల్లగొండ జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
అలాగే సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, యువత సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్‌బీ సీఐ ఆది రెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆమేర్, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments