చీకటి వెలుగు – నల్లగొండ:
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ దేవస్థాన నూతన పాలకమండలి చైర్మన్‌గా త్వరలో నియమితులు కాబోతున్న చీదేటి వెంకట్ రెడ్డి గారికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా దేవస్థాన నూతన పాలకమండలి సభ్యులతో కలిసి ఆయనను దేవాలయ అధికారులు, పూజారులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
దేవాలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, ప్రధాన పూజారులు నాగోజు మల్లాచారి, శ్రమణాచార్యులు తదితరులు చీదేటి వెంకట్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేవాలయ అభివృద్ధికి నూతన పాలకమండలి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ పలువురు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానానికి చెందిన పలువురు భక్తులు, స్థానిక ప్రముఖులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments