చీకటి వెలుగు – నల్లగొండ:
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 64 మంది కుక్కల ప్రేమికులకు కుక్క పిల్లలను దత్తత ఇచ్చారు.
కుక్క పిల్లల దత్తతపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుక్క అత్యంత విశ్వాసమైన జంతువని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న వానాకాలంలో కుక్కకాట్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments