ePaper
Monday, June 15, 2026

సైమ అంతర్జాతీయ ఎన్‌ఆర్ఐ సెల్ అధ్యక్షురాలిగా గోలి నవ్య రెడ్డి నియామకం

చీకటి వెలుగు..

అమెరికాలోని అట్లాంటా నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సైమ) అంతర్జాతీయ ఎన్‌ఆర్ఐ సెల్ అధ్యక్షురాలిగా నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, ప్రముఖ ప్రవాస భారతీయురాలు గోలి నవ్య రె్డ్డిని నియమించారు. ‘సైమ’ ఫౌండర్ ప్రెసిడెంట్ నకిరేకంటి స్వామి ఆమెకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నకిరేకంటి స్వామి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ‘సైమ’ కార్యకలాపాలను విస్తరించడమే లక్ష్యంగా ఎన్‌ఆర్ఐ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోలి నవ్య రెడ్డి నాయకత్వంలో ఈ విభాగం అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు ఉన్న వృత్తిపరమైన అనుభవం సంస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తనపై విశ్వాసంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ‘సైమ’ యాజమాన్యానికి గోలి నవ్య రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియన్ మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంస్థ ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొని గోలి నవ్య రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!