ePaper
Saturday, May 30, 2026

జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం.. మీడియా అకాడమీ కీలక నిర్ణయం

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం పొందిన పలువురు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఆర్థిక సహాయం కోసం వచ్చిన 29 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ, 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సహాయం మంజూరు చేసింది.

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రతి నెల రూ.3 వేల చొప్పున ఐదేళ్ల పాటు పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అలాగే ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!