ePaper
Tuesday, June 23, 2026

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే ఉత్సవాలను స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మేడే ప్రాముఖ్యతను నాయకులు వివరించారు. చికాగోలో 8 గంటల పని విధానం కోసం కార్మికులు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, అమరుల త్యాగాలను గుర్తు చేశారు.

నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాలకు ముగింపు పలికి, కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ వంటి హక్కులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ మోహినుద్దీన్, కార్మిక నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!