చర్ల పల్లి డివిజన్ కు చెందిన ప్రభుత్వ రెండుపడకల కాలనీకి చెందిన* ఉపాద్యాయుడు సురేష్ రావెళ్ల* గారి తొమ్మిది యేళ్ల కుమారుడు నెవిల్ జెర్మీయా సంగీతములో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకొన్నారు.
ఫిబ్రవరి 2, 2026 న 22 దేశాలకు చెందిన 2000 మంది సంగీత కళాకారులతొ ప్రఖ్యాత హలెల్ సంగీత పాఠశాల వారు నిర్వహించిన ఈ బృహతర సంగీత కార్యక్రమం
గినీస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నది .ఇందులో ఏకధాటిగా ఒక గంట సేపు కీబోర్డ్ వాయించారు.
ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన 777 మందికి , నిర్వహకులైన బ్రదర్ అగస్టీన్ దండింగి గారు 29 మే 2026 రోజున గచ్చిబౌలి లో జరిగిన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో గినీస్ ప్రతిభ పత్రాన్ని, మెడల్ ను అందించి అభినందించారు.. తండ్రి ప్రేరణ పొందిన కుమారుడు నెవిల్ గినీస్ లో పాల్గొని చోటు సంపాదించుకున్నాడు.. నెవిల్ నాగారం లోని సెయింట్ మేరీ బేతని కాన్వెంట్ విద్యాలయ హై స్కూల్ లో 5 వ తరగతి చదువుతున్నాడు.
వీరిద్దరిని కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు, చర్లపల్లి 2BHK కాలనీ వాసులు అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments