ePaper
Monday, April 27, 2026

తల్లి కోసం కోర్టు వరకు అన్నదమ్ములు…110 ఏళ్ల తల్లిపై ప్రేమకు నిదర్శనం

ఇటీవల హైకోర్టులో ఒక భావోద్వేగానికి గురిచేసే కేసు ముందుకు వచ్చింది. కేసు వేసిన వారు ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు 80 ఏళ్లు, మరొకరు 70 ఏళ్లు.

మొదట ఇది ఆస్తి వివాదమని భావించిన జడ్జికి, కేసు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యం కలిగింది.

వాస్తవానికి వారి తల్లి (110 ఏళ్లు) గత 40 సంవత్సరాలుగా పెద్ద కుమారుడి వద్ద ఉంటోంది. తమ్ముడు మాత్రం తన వద్ద కూడా తల్లి ఉండాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

జడ్జి ఇద్దరినీ మాట్లాడించి సమస్యను పరిష్కరించాలనుకున్నా, ఇద్దరూ తల్లి తమ దగ్గరే ఉండాలని పట్టుబట్టారు.

చివరకు తల్లిని కోర్టుకు తీసుకువచ్చి ఆమె అభిప్రాయం అడగగా, “ఇద్దరూ నాకు సమానమే… ఎవరి మనసును గాయపరచలేను” అని భావోద్వేగంతో స్పందించింది.

తర్వాత జడ్జి పరిస్థితులను పరిశీలించి తల్లిని తమ్ముడి వద్ద ఉండాలని ఆదేశించారు.

ఈ ఘటన నేటి సమాజంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!