ePaper
Thursday, September 3, 2026

మహనీయుల విగ్రహాలకు అవమానం సహించం

సంతు రవిదాస్ చిత్రపటానికి నల్లరంగు పూయడం దుర్మార్గం

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాకీ నరసింహ

చీకటి వెలుగునల్గొండ

మహనీయుల విగ్రహాలను అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాకీ నరసింహ అన్నారు. గురువారం స్థానిక డా.బి.ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఆదేశానుసారం సంత్ రవిదాస్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. .ఈ సందర్భంగా బాకీ నరసింహ గారు మాట్లాడుతూ.. సంత్‌ రవిదాస్ మహారాజ్ వంటి మహనీయుల చిత్రపటాలకు నల్లరంగు పూయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని సంబదితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మహనీయుల ఆశయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారి విగ్రహాలను అవమానించడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ మహనీయుల పట్ల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, అయితే రాజకీయ విభేదాలను వ్యక్తిగత దాడులకు, అవమానకర చర్యలకు దారితీయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్షలకు తావులేకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రవిదాస్ మహారాజ్ గారిని అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మహనీయుల గౌరవాన్ని కాపాడుతూ, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక ఎస్సై గారికి పిర్యాదు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింత ముత్యాల రావు, కార్యాలయ కార్యదర్శి మంగళపల్లి కిషన్, మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నెవర్సు నీరజ, మండల అధ్యక్షులు బొగరి అనిల్ కుమార్, వన్ టౌన్ ఇంచార్జీ పెరిక నరసింహ, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చినేని జాని, ఎస్సీ మోర్చ సీనియర్ నాయకులు కొమ్ము రాందాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి వెంకన్న, పుల్లెంల శ్యామ్, చామకూరి మహేష్, జిల్లా కోశాధికారి అదిమల్ల దేవేందర్, కొత్తపల్లి ప్రమోద్, మహిళా నాయకురాలు గూగులోతు తార, కందుకూరి సుధాకర్, చింతపల్లి వెంకన్న, మర్రి ఏడుకొండలు, పోత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!