చర్ల పల్లి డివిజన్ కు చెందిన జేసన్ విజన్ ట్యుటోరియల్ మరియు రోజ్ ఆఫ్ షారోన్ వ్యవస్తాపకుడు అయిన సురేష్ రావెళ్ల రెండవ సారి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకొన్నారు.
ఫిబ్రవరి 2, 2026 న 22 దేశాలకు చెందిన 2000 మంది సంగీత కళాకారులతొ ప్రఖ్యాత హలెల్ సంగీత పాఠశాల వారు నిర్వహించిన ఈ బృహతర సంగీత కార్యక్రమం
గినీస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నది .ఇందులో ఏకధాటిగా ఒక గంట సేపు కీబోర్డ్ వాయించారు.
ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన 777 మందికి , నిర్వహకులైన బ్రదర్ అగస్టీన్ దండింగి గారు 29 మే 2026 రోజున గచ్చిబౌలి లో జరిగిన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో గినీస్ ప్రతిభ పత్రాన్ని, మెడల్ ను అందించి అభినందించారు. అలాగే సురేష్ గారు 2023 లో స్టార్ బుక్, 2024 లో ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇంజీనియస్ మరియు మొదటి గినీస్ రికార్డు ల్లో చోటు సంపాదించుకున్నారు. తండ్రిని చూసి ప్రేరణ పొంది,తండ్రి దగ్గరే సంగీతం శిక్షణ పొందిన 9 యేళ్ల కుమారుడు నెవిల్ మొదటి సారి గినీస్ లో పాల్గొని చోటు సంపాదించుకోవడం విశేషం .ఆంగ్ల భాష ఉపాధ్యాయుడైన సురేష్ గారు,తన అంగవైకల్యం ను జయించి అనేక మంది విద్యార్థులకు ఇంగ్లీషు తెలుగు హిందీ ఫోనిక్స్, గ్రామర్ ,హ్యాండ్ రైటింగ్ తో పాటు (వెస్ట్రన్ మ్యూజిక్)కీబోర్డ్ లో శిక్షణ కూడా ఇస్తున్నారు.
వీరిద్దరిని కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు, చర్లపల్లి 2BHK కాలనీ వాసులు అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments