ePaper
Thursday, September 3, 2026

రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ ధర్నా

కాంగ్రెస్‌ 1,000 రోజుల పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసం: బీఆర్‌ఎస్‌ ఆరోపణ

చీకటి వెలుగునల్లగొండ,

రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట చేపట్టిన నిరసనల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి నాయకత్వం వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా మాజీ కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కటికం సత్తయ్యగౌడ్‌ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి, వ్యవసాయ రంగానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ధర్నా సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ సర్పంచులు తుమ్మల లింగస్వామి, నారబోయిన బిక్షం, కృష్ణార్జునరెడ్డి, బుచ్చిరాజు, సైదులు, విమలమ్మ, గుండెబోయిన జంగయ్య, బడుపుల శంకర్‌, శ్రీనాథ్‌, జయపాల్‌రెడ్డి, నరసింహ, జాన్‌రెడ్డి, నర్సిరెడ్డి, శంకర్‌, లింగయ్య, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!