ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు NCTE నిబంధనలకుఅనుగుణంగా 2025 సెప్టెంబర్లో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో అందోళనచెందిన సర్వీస్ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్లు వేశారు, నిబంధనల ఆధారంగానేసుప్రీం కోర్ట్ అ రివ్యూలను కొట్టివేస్తూ 2028 ఆగష్టు 31 లోపు ఇన్ సర్వీస్టీచర్స్కు చివరి అవకాశంగా తీర్పు ఇచ్చినది. దీని ప్రకారం సర్వీస్ రిమూవ్ చేసేఅవకాశం ఉంది. తెలంగాణలో 30,000 మంది ఉపాధ్యాయులకు TET పాస్ కావాల్సినఅవసరం ఉంది. ఇటీవల ప్రత్యేకంగా 2సార్లు TET నిర్వహణ చేస్తామనేరాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాస్త ఊరట మాత్రమే. విద్యా హక్కు చట్టం అమలు ద్వారా TET అంశం ప్రస్తావనజరిగింది. 1 ఏప్రిల్, 2010 పూర్వం న్యాయ బద్ధంగా నోటిఫికేషన్ వచ్చినియామకం అయిన ఉపాధ్యాయులకు ఆనాడు TET ప్రస్తావన లేదు. తర్వాత DSC నోటిఫికేషన్లో TET అర్హత అధారంగానేనియామకాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1,2010 RTE రూల్స్ అనుగుణంగా NCTE TET నిబంధనలుచేర్చింది. ఈ నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇది ఇన్ సర్వీస్ఉపాధ్యాయులకు అన్యాయం కల్గిస్తుంది. గత 30 సంవత్సరాలనుండి ఉపాధ్యాయులు ఎంపికచేసుకున్న విషయంలో భోదిస్తున్నారు. TET లో మాత్రం అన్ని విషయాలు కలిపి పరీక్షలుపెట్టడం జరుగుతుంది. భాషా ఉపాధ్యాయులకు, ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా తమ బోధనకుసంబంధం లేని సబ్జెక్టు చదవి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిప్పుడుప్రత్యేకంగా TET ఎన్ని సార్లు పెట్టిన ప్రయోజనం లేదనే భావన ఉపాధ్యాయుల్లో ఉంది.పైగా NCERT, SCERT ఆధ్వర్యంలో, దీక్ష, నిష్ట లాంటి అనేకఆన్లైన్ వృత్యంతర శిక్షణ ఇస్తూనే ఉన్నారు. తద్వారా సమకాలిన పరిస్థితులకు అనుగుణంగాఉపాధ్యాయులు. నేర్చుకుంటున్నారు. ఇది అసంబద్ధ నిర్ణయంగా తపస్ అనేక మార్లుప్రభుత్వాలకు నివేదించింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం-TPUS ద్వారా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినేన్స్ తెచ్చి ఏప్రిల్ 1,2010 కన్న ముందువేసిన నోటిఫికేషన్ ద్వారా నియమాలు అయిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపునుకోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రభుత్వంను ఒప్పించేలాతగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తినిభాస్కర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగు శ్రీరాం, రాష్ట్ర వెబ్ కన్వీనర్ కంచనపల్లివిజయ్‌కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు దోటి కిషన్ ప్రసాద్, జిల్లా కోశాధికారి నంద్యాల నర్సిరెడ్డి, మునుగోడు మండల అధ్యక్షుడు మిర్యాలమురళి, నల్లగొండ రూరల్ శాఖ ప్రధాన కార్యదర్శినిమ్మనగోటి రామకృష్ణ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments