ePaper
Friday, June 19, 2026

జర్నలిస్టులకు ఊరట.. బస్‌పాస్ గడువు పెంపు, కొత్తవాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రవాణా సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్తగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్‌పాస్‌ల మంజూరు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు జారీ చేసింది.

ఈ మేరకు జూన్ 17, 2026 నుంచి ఏప్రిల్ 30, 2028 వరకు చెల్లుబాటు అయ్యే బస్‌పాస్‌లను జారీ చేయనున్నట్లు పేర్కొంది.

అలాగే, ఇంకా కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందని జర్నలిస్టులకు ఊరటనిస్తూ ప్రస్తుతం వినియోగిస్తున్న పాత బస్‌పాస్‌ల గడువును జూన్ 17 నుంచి 30వ తేదీ వరకు మరో 14 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కాలంలో పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగిసినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత బస్‌పాస్‌లతోనే ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను కోరింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!