జిల్లా కేంద్రంలో శాంతి స్థాపన కోసం కృషి చేసిన మహానుభావుడు కొలనుపాక మురళీధర్ రావు అని పలువురు కొనియాడారు.
మంగళవారం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయనకు ఘన నివాళులర్పించారు.
న్యాయవాదిగా, కవి రచయితగా, శాంతి సంఘం సభ్యుడిగా ఆయన సమాజానికి ఎన్నో సేవలు అందించారని సభలో పాల్గొన్నవారు స్మరించుకున్నారు.
సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఎంతోమందికి బాసటగా నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. కిషన్ రావు, రిటైర్డ్ ఎస్పీ శేషగిరిరావు, డాక్టర్ నరసింహారావు, పలువురు న్యాయవాదులు, కవులు, రచయితలు, శాంతి సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments