ePaper
Saturday, September 5, 2026

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు… కలెక్టర్ సత్య శారద కీలక ఆదేశాలు

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జరిగిన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

జీవో 252 ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని ఆమె తెలిపారు.

ఐపీఆర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా కార్డులు జారీ చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.

ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులకు 2026–2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, జర్నలిస్టులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డిపిఆర్ఓ ప్రేమలతతో పాటు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!