ePaper
Wednesday, April 22, 2026

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్… 3 ఏళ్లు పూర్తైతేనే అర్హత

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జనరల్ ట్రాన్స్‌ఫర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

ఒకే చోట కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు మాత్రమే బదిలీలకు అర్హులు. అదే స్థలంలో నాలుగేళ్లు పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు.

జనగణన విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ బదిలీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఏ కేడర్‌లో అయినా మొత్తం సిబ్బందిలో 40 శాతానికి మించకుండా బదిలీలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్పౌజ్ కేసులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.

గెజిటెడ్ ఆఫీసర్లకు తమ సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరు. బదిలీల ప్రక్రియను మూడు స్థాయిల కమిటీల ద్వారా నిర్వహించడంతో పాటు, వెబ్ కౌన్సెలింగ్ విధానంలో 5 ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!