ePaper
Thursday, September 3, 2026

*భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పైన దాడికి కుట్రపన్నడం హేయమైన చర్య

చీకటి వెలుగు నల్లగొండ.

  • దాసరి సాయికుమార్ బిజెపి కార్పొరేటర్ నల్లగొండ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలలో భాగంగా రాజకీయ అసహనంతో కుట్రపూరితంగా బిజెపి కార్పొరేటర్ల పైన… కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడికి దిగాలని ప్రయత్నించి మా ఇండ్ల వరకు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి మునిపెన్నడూ లేని విధంగా నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది..
    కేవలం బిజెపి పార్టీ ఎదుగుదల పార్టీ కార్పొరేటర్స్ ప్రజలతో మమేకమై సుపరిపాలన అందించడమే.. కాంగ్రెస్ నాయకులకు కంటగింపుగా మారిందని బిజెపి కార్పొరేటర్ దాసరి సాయికుమార్ అన్నారు
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజల పట్ల విశ్వాసంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పైన ముఖ్యంగా నా ఇంటి పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేసే ప్రయత్నం చేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు ఈ దాడికి పాల్పడడానికి గల కారణాలు మేము నల్లగొండ 48 డివిజన్ పరిధిలో గల అభివృద్ధి పైన నిధుల దుర్వినియోగం పైన ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిలదీయడంతో మాపై కక్ష సాధింపు చర్యగా కుట్రపూరితంగా దాడులకు పాల్పడాలనే వ్యూహరచన జరిగిందని కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతుందని ప్రజల ఆస్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగా వారు కడుతున్నటువంటి పనుల రూపంలో వచ్చిన డబ్బులను అభివృద్ధికి మాత్రమే వాడాలని దుబారా ఖర్చులు చేయొద్దని మేము కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినందుకు వారిని నిలదీసినందుకు మాపై కుట్ర పన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేయడం జరిగింది…
    ఇలాంటి తాటాకు చప్పట్లకు మేం భయపడమని మీరు ఎన్ని దాడులకు పాల్పడ్డ మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన మేము ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలుస్తానని నేను ఇప్పటికీ మా కుటుంబం నుంచి రెండోసారిగా కౌన్సిల్లో అడుగుపెట్టామని ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నాకు మా కుటుంబ సభ్యులకు ఉంటుందని అన్నారు… మాపై దాడికి ప్రయత్నించినటువంటి వారి మీద నల్లగొండ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నేను ఫైల్ చేయడం జరిగింది . మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఉంటాం మేము వ్యక్తిగత రాజకీయాలు చేయడం కేవలం రాజకీయం అన్నది ఎన్నికల మాత్రమే మా పరువు పరిమితం చేసుకుంటూ మిగతా అభివృద్ధిపైనే కాలాన్ని మేము ప్రజల పక్షాన కేటాయిస్తామని చిల్లర రాజకీయాలకు మేము దూరంగా ఉంటామని తెలియజేస్తూనాన్నని అన్నారు.. బీజేవైఎం నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు వంగూరి రాఖీ మాట్లాడుతూ.. ఇటీవల నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో రాజకీయ అలజడి కేవలం ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వెళ్లబుచ్చుకొని మేము మా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దాడికి నిరసనగా నల్లగొండ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేయడం జరిగింది అక్కడ ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరికి ఇబ్బంది కలిగించలేదు కేవలం మా నిరసనలు మాత్రమే తెలియజేశాం . కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకుని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా మా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లిగారు ఉంటున్నటువంటి నివాస ప్రాంతంలో ఆ నివాసం మీద కేవలం ఒక మహిళ అని కూడా చూడకుండా ముక్కుమూడిగా రౌడీముఖల్లాగా ఇంట్లోకి చేరి కనీస స్పృహలో లేకుండా ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తూ నోటితో చెప్పడానికి వీలు లేనటువంటి పదాలను వాడుతూ వారి ఇష్టారాజ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను సామాగ్రిని పగలగొడుతూ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది . ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు సమాజంలో పెద్ద మనుషులుగా చలామనవతు రాజకీయ పదం కోసం వ్యక్తిగత దాడులకు పాల్పడడం నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన సాగిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి నల్లగొండలో జరుగుతున్నటువంటి ఈ వ్యక్తిగత దాడుల పట్ల నల్లగొండ ప్రజలే కాకుండా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఈ నల్లగొండ వైపు తొంగి చూస్తుంది ప్రజల గమనిస్తున్నారని కనీస అవగాహన లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుల పైన ఈ జిల్లాకు జాతీయ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి ఈ నల్లగొండ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి తల్లి ఇంటి పైన దాడి చేయడం అంటే ఇంత దౌర్జన్యకాండ ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించిందంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టే ఇలాంటి విర్రవీగచేతలు చేస్తా ఉన్నారు అధికారమనేది శాశ్వతం కాదు కానీ ఇలాంటి తాటాకు చప్పులకు మేము భయపడేది లేదు వెంటనే వారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు… ప్రజల చేత ఎన్నుకున్న కార్పొరేటర్ లను వ్యక్తిగత కారణాల చేత తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి దారుణలకు పాడుతున్నారని అన్నారు..
    ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కాబట్టే మేము కూడా దాడులకు పాల్పడేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు కూడా ఉన్నాయి అని కానీ కేవలం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులుగా సంస్కారం గా ఉన్నటువంటి వ్యక్తులుగా మేము చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగినటువంటి వాతావరణం మా పార్టీ కున్న నిబద్ధత కారణాల చేత మేము మేము చట్టపరంగా చట్టాన్ని నమ్ముకొని ముందుకు పోయేటువంటి వ్యక్తులు కాబట్టి పోలీస్ శాఖ వారిని కూడా ఒక్కటే కోరుతున్నాం మేము మా అధ్యక్షుని ఇంటి పైన మా కార్యకర్తల పైన మరియు మా కార్పోరేటర్ల పైన దాడికి ప్రయత్నించినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టవలసిందిగా పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అని అన్నారు..
    ఇందులో.. దాసరి సాయికుమార్, వంగూరి రాఖీ, అక్కేపల్లి బలరాం.. దుర్గ, వెంకటేష్ పాల్గొన్నారు

Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!