మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
చీకటి వెలుగునల్లగొండ:
ప్రజా జీవితంలో విశేష సేవలందించిన మాజీ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కీ.శే. పెరిక గోపాల్, మాజీ ఎమ్మెల్యే కీ.శే. పెరిక రాజరత్నం విగ్రహాలను గురువారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ కూడలిలో ఘనంగా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నాయకుడు పెరిక కరం జయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరై విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పెరిక గోపాల్, మాజీ ఎమ్మెల్యే పెరిక రాజరత్నం ప్రజా జీవితంలో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వారు చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పెరిక కరం జయరాజు మాట్లాడుతూ తమ తండ్రి పెరిక గోపాల్, బాబాయ్ మాజీ ఎమ్మెల్యే పెరిక రాజరత్నం నల్లగొండ జిల్లా రాజకీయ, సామాజిక రంగాల్లో తమదైన ముద్ర వేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం వారు నిరంతరం కృషి చేశారని తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి అనేక సేవా, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, కత్తుల జగన్, భువనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీను, బుర్రి వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments