మహిళా కార్పొరేటర్ల భర్తల జోక్యంపై కఠిన వైఖరి
నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మహిళా కార్పొరేటర్ల భర్తలు అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై నూతన కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మున్సిపల్ పరిపాలన, డివిజన్ స్థాయి పనుల్లో కుటుంబ సభ్యుల జోక్యాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మహిళా కార్పొరేటర్ల భర్తలు అధికారులకు ఫోన్‌లు చేస్తూ పనుల విషయంలో ఒత్తిడి తీసుకురావడం, అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ అభిప్రాయపడినట్లు సమాచారం.
అధికారిక వ్యవహారాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యానికి తావులేదని కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ తీసుకున్న ఈ కఠిన వైఖరితో పలువురు కార్పొరేటర్లు అప్రమత్తమైనట్లు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments