చీకటి వెలుగు నల్లగొండ.

ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలూస్ కమిటీ అధ్యక్షులు సల్మాన్ ఖాద్రి ఆధ్వర్యంలో మిలాద్ జూలూస్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లగొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ (అమేర్) జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్డు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా భక్తిశ్రద్ధలతో సాగి తిరిగి దర్గా మెట్ల వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ నాత్ గాయకులు వీధుల గుండా పాదయాత్ర చేస్తూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రేమను చాటుతూ నాత్ పాటలు ఆలపించారు. వారి గానంతో పురవీధులు మార్మోగగా, భక్తులు స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో మిలాద్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం దర్గా మెట్ల వద్ద దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
ర్యాలీ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులు మిలాద్ సందడితో కళకళలాడాయి. ప్రవక్త గారి సందేశమైన ప్రేమ, శాంతి, సోదరభావం ప్రజల్లో ప్రతిధ్వనించేలా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమంలో మిలాద్ జూలూస్ కమిటీ ప్రెసిడెంట్ సల్మాన్ ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ ఆబేద్, అడ్వైజర్ ఎండి కలీమ్ ఖాన్ (జర్నలిస్ట్), మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ మసి ఉద్దీన్ (అడ్వకేట్), సెకరెటరీ అబిద్,సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ హాశం, సలీం, పీస్ కమిటీ సభ్యులు ఎంఐఎం సీనియర్ నాయకులు ఖాజా గౌస్ మొహియుద్దీన్, విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివ, బిఆర్ఎస్ నాయకులు జమాల్ ఖాద్రి, సిపిఎం నాయకులు దండంపళ్లి సత్తయ్య, కమిటీ సభ్యులు సుపియన్ ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు..
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments