ePaper
Friday, September 4, 2026

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.

చీకటి వెలుగు నల్లగొండ

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాగిళ్ల మురళి, కన్వీనర్ బి. యాదయ్య డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్, క్లాస్–IV, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని వారు కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను చెల్లించి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి మెరుగైన వైద్య భద్రత కల్పించాలన్నారు.
నెలల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నాలో నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజశేఖర్, భిక్షం, వెంకటేశామ్, అంజిరెడ్డి, శ్రీనివాస్, రమేశ్, రాంబాబు, యాకూబ్ నాయక్, యాదగిరి, జయరావు, జమీరుద్దీన్, జి. వెంకట్రెడ్డి, కె. మనోజ్ ప్రదీప్, రాములు, సత్యనారాయణ, శక్తీష్ చంద్ర, జనార్ధన్, పి. వెంకటేశం, హలీం, కాసీం, భిక్షపతి, సోమేశ్ కుమార్, విద్యాసాగర్, కరుణగౌడ్, రంధేవు, నరేశ్, రమ్యసుధ, సుమలత, సతీష్, మధు, లక్ష్మి, సునీత, షఫీ తదితరులు పాల్గొన్నారు.
TNGO, TGO అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు, DRDA, పోలీస్, గురుకుల ఉపాధ్యాయుల JAC ప్రతినిధులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!