ePaper
Friday, September 4, 2026

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు

  • తపస్ గురువందన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి

చీకటి వెలుగు నల్లగొండ.

నల్గొండ పట్టణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే గురువందన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వ ప్రభుత్వం ఉపాధ్యాయ గౌరవాన్ని పెంచేలా చూడాలని దరఖాస్తుల ద్వారా ఉపాధ్యాయుల సన్మానించే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిద్భారత్ కు పునాది అవుతుందని తరగతి గదిలలో జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడు కీలక భూమిక పోషిస్తారని వారు అన్నారు.ప్రధాన వక్తగా విచ్చేసిన భాస్కర్ యోగి గారు మాట్లాడుతూ విలువలు బోధించాలి రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి అవునొచ్చని విద్యార్థులకు తెలియజేశారు చిన్నచిన్న కథల రూపంలో అవగాహన కల్పించాలని కోరారు.సమాజంలో నైతిక విలువల పతనం అయితే సమాజం విలువ తగ్గుతుంది.పాఠశాలలోనే సంస్కారాల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.సమాజంలో ఉన్నత స్థాయి ఉద్యోగ పరీక్షలకు పోటీపడే పేద విద్యార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచిత కోచింగ్ మరియు మెటీరియల్ అందజేయడం జరుగుతుందని,సమాజంలో అణగారిన వర్గాల పిల్లల చదువు కోసం ఇతోదిక సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నానని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు హామీ ఇచ్చారు…తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేస్తూ గురువు ఔనత్యాన్ని పెంచాలి. జిల్లా స్థాయి ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్,రాష్ట్ర బాధ్యులు పర్వతం సంధ్యారాణి, ఇరుగు శ్రీరాములు, కట్టెబోయిన శ్రీనివాస్, కొమిరెల్లి భాస్కర్ రెడ్డి, కంచనపల్లి విజయ్ కుమార్, వివిధ మండలాల మండల విద్యాధికారులు,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వివిధ మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!