ePaper
Friday, September 4, 2026

రాజు మృతికి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బాధ్యత వహించాలి: పిల్లి రామరాజు

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన రాజు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బాధ్యత వహించాలని పిల్లి రామరాజు అన్నారు. రాజు కుటుంబం నిరుపేద కుటుంబమని, వారి కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అనధికార ఫ్లెక్సీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలని పిల్లి రామరాజు డిమాండ్ చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!