చీకటి వెలుగు నల్లగొండ
నల్లగొండ పట్టణంలోనిశ్రీనివాస కాలనీ బీటీఎస్ లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, యువతీ యువకులు నృత్యాలతో సందడి చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.
ఈ కార్యక్రమంలో ఈసం యాదగిరి, కమ్మంపాటి జానయ్య,శంకరమ్మ, బొడ్డుపల్లి శ్రీనివాస్,కవిత, బొడ్డుపల్లి లింగస్వామి,లింగమ్మ, సిరసనవాడ సత్యనారాయణ,అరుణ, నీరుకొండ సైదులు,కవిత, బండారు గోపీ,వజమ్మ, దొమ్మేటి నాగరాజు,కల్యాణి, కస్పా రాజు కృష్ణయ్య,ఎల్లమ్మ, సిరికొండ జయమ్మ తదితరులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments