ePaper
Friday, September 4, 2026

11వ డివిజన్‌లో రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం

నల్గొండ: 11వ డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు.

ఇంద్రారెడ్డి రైస్ మిల్లు నుంచి మధురాపురి కాలనీ, న్యూ మారుతి నగర్, తెలంగాణ కాలనీ, చంద్రపురి కాలనీ మీదుగా పాత ధర్వేశిపురం రోడ్డు వరకు రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు కాలనీల మధ్య రాకపోకలను సులభతరం చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో జూలకంటి ఇంద్రారెడ్డి, సుంకిరెడ్డి నర్సిరెడ్డి, మెగావత్ కొండా నాయక్, దండంపెల్లి అనిల్, మాతంగి బళ్ళు పోగుల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!