మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విషాదం
నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రాజు అనే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఫ్లెక్సీ ఏర్పాటు సమయంలో విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రమాదం జరిగిన అనంతరం భూపాల్ రెడ్డి ఫ్లెక్సీని కొందరు ప్రజలు చించివేశారు.
నగరంలో ప్రమాదకర ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, అనుమతులు లేకుండా బ్యానర్లు పెడుతున్నారనే ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేతల పుట్టినరోజులు, పార్టీ కార్యక్రమాల పేరుతో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఫ్లెక్సీల ఏర్పాటుపై పర్యవేక్షణ లోపమే ఈ ప్రమాదానికి కారణమా?
అక్రమ, ప్రమాదకర ఫ్లెక్సీలపై నగరపాలక సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
ఒక్క చిన్న నిర్లక్ష్యం.. ఓ కుటుంబానికి తీరని విషాదం!
మృతుడు రాజు కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారు? మరో ప్రాణం పోయే వరకు అధికారులు వేచి చూస్తారా?
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments