చైర్మన్‌గా శ్యామ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా షాహిన్ బేగం
చీకటి వెలుగు నల్లగొండ:
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలతో కూడిన సీడీ–5 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నల్గొండలోని నాగదుర్గ నృత్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు నల్గొండ ఎక్సైజ్ సీఐ బి. ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా ఎం. శ్యామ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా వి. శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా షాహిన్ బేగం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. సీడీ–5 పరిధిలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఆయా జిల్లాలకు చెందిన ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments