ePaper
Friday, September 4, 2026

రూపా రెడ్డి హత్యను ఖండిస్తూ ట్రస్మా ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ

చీకటి వెలుగు నల్లగొండ.

నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రూపా రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలియజేశారు. వేలాది మంది పాల్గొనడంతో ర్యాలీకి భారీ స్పందన లభించింది.
విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరి భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలలో పనిచేస్తున్న యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపా రెడ్డి హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని అన్నారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ,విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ దారుణం సమాజం మొత్తాన్ని కలచివేసిందన్నారు.రూపా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యాసంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. ట్రస్మా రాష్ట్ర నాయకులు కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ, రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా సమాజం అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీస్ శాఖలు వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర నాయకులు ముక్కముల రామ్మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,అలాంటి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.రూపా రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ట్రస్మా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్గుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు విద్యా రంగం తరఫున తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ట్రస్మా నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ నింబారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో సంఘీభావ ర్యాలీలో పాల్గొని తమ ఐక్యతను చాటారని తెలిపారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.వివిధ పాఠశాలల యాజమాన్యాల భాగస్వామ్యం అయ్యారు.ఈ సంఘీభావ ర్యాలీలో నల్లగొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల వ్యవహర్తలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారంతా “రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి – నిందితులను కఠినంగా శిక్షించాలి” అంటూ నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు.విద్యా రంగానికి చెందిన ప్రతి ఒక్కరి భద్రత, గౌరవం, హక్కుల కోసం ఐక్యంగా నిలబడతామని టస్మా నాయకులు స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!