చీకటి వెలుగు నల్లగొండ
187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలో ఫోటో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఫోటో జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచి అవార్డు సాధించిన సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ను, ఇతర ఫోటోగ్రాఫర్లను మేయర్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఒక ఫోటో వెయ్యి మాటలతో సమానమని, సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనను ప్రజల కళ్లముందుకు తీసుకురావడంలో ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చరిత్రకు దృశ్య సాక్ష్యాలుగా నిలిచే ఫొటోలను అందిస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మంచి ఫోటో వెనుక ఫోటోగ్రాఫర్ ప్రతిభ, పరిశీలనా శక్తి, సృజనాత్మకత ఎంతో ముఖ్యమన్నారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అవార్డులు సాధించిన ఫోటో జర్నలిస్టులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలను ఆవిష్కరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఫోటోగ్రాఫర్లు కంది శ్రీనివాస్ ప్రసాద్, కనకయ్య, భవాని ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments