చీకటి వెలుగు నల్లగొండ,
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి, మలి దశల్లో కీలకంగా పోరాడిన ఉద్యమకారుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు గ్రహీత చక్రహరి రామరాజు 81వ జన్మదిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన సేవలను కొనియాడారు.వృత్తులు వేరైనా.. మా నెత్తురు ఒక్కటే అన్న స్ఫూర్తితో బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం రామరాజు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి బీసీ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్వనాథం,కంది సూర్యనారాయణ,వెంకటేశం, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments