చీకటి వెలుగు నల్లగొండ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని యునైటెడ్ దళిత క్రిస్టియన్స్ ఫెడరేషన్ (యూడీసీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ పట్టణంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో యూడీసీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫెడరేషన్ అధ్యక్షుడిగా డి. ఐ. సామ్సన్, ఉపాధ్యక్షుడిగా జేపీ సాల్మన్ రాజు, ప్రధాన సలహాదారుగా డాక్టర్ ప్రధాన కార్యదర్శిగా పి. డేవిడ్ రాజు, నిర్వహణ కార్యదర్శిగా డి. ఎవినేజర్, సలహాదారుగా పి. జేమ్స్, కోశాధికారిగా ఆదిమల్ల ప్రభుదాసు ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు, పాస్టర్లు, సంఘ పెద్దలు, పలువురు వక్తలు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు, రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments