ePaper
Friday, September 4, 2026

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు

చీకటి వెలుగు – నల్లగొండ

తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచే అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఆయన చూపిన మార్గం, సిద్ధాంతాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్ర సాధనకు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

అనంతరం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రొఫెసర్ జయశంకర్‌కు తగిన గౌరవం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, నల్లగొండలోని ఆయన విగ్రహానికి అలంకరణ చేసి పూలమాలలు వేసే పరిస్థితి కూడా కల్పించలేదని ఆరోపించారు. అలాగే, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని, తెలంగాణ ఏర్పాటుకు కారణమైన లక్ష్యాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ మాజీ చైర్మన్ గుండె వెంకటేశ్వర్లు, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్ రావు, లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, సిరిగిరి వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, మారగొని గణేష్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, రత్నగిరి శ్రీనివాస్, గోపగోని స్వాతి రాజశేఖర్, సింగం లక్ష్మి, దండంపెల్లి సత్తయ్య, భాషపాక హరికృష్ణ, కౌకూరు వీరాచారి, ఎ. కన్నారావు, కందుల లక్ష్మయ్య, కంకణాల వెంకటరెడ్డి, వజ్జ శ్రీనివాస్, తంగేళ్లపల్లి రవీంద్రచారి, శాగటి రాములు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!