చీకటి వెలుగు – నల్లగొండ
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
డివిజన్ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన తమ ప్రధాన లక్ష్యమని కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు యాదవ్ స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments