ePaper
Friday, September 4, 2026

మాను లో యూజీ, పీజీ ప్రవేశాలకు అవకాశం

చీకటి వెలుగు నల్లగొండ.

తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మాను)లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మాను స్టడీ సెంటర్ నల్గొండ సమన్వయకర్త డా. ఎస్.కె.ఆర్. అన్సారీ తెలిపారు. విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో బి.ఏ. (ఆనర్స్), బి.కాం, బి.ఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పీజీ విభాగంలో అరబిక్, ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్‌లో ఎం.ఏ. కోర్సులకు ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే జర్నలిజం, ఇంగ్లిష్ బోధన, బాల్య సంరక్షణ–విద్య, పాఠశాల నాయకత్వం, ఉపాధి నైపుణ్యాలు, ఉర్దూ డిప్లొమా కోర్సులతో పాటు ఉర్దూ మాధ్యమం ద్వారా ఇంగ్లిష్ ప్రావీణ్య ధ్రువపత్ర కోర్సులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ప్రవేశాల ప్రక్రియ, కోర్సుల ప్రత్యేకతలు, విద్యార్థులకు లభించే అవకాశాలపై విశ్వవిద్యాలయ ప్రాంతీయ సంచాలకులు డా. మజహర్ ఖాద్రీ, క్యూ డైరెక్టర్ డా. సమీ సిద్ధిఖీ, సహాయ సంచాలకులు డా. అమాన్ అబేద్ తదితరులు నిర్వహించిన సమావేశంలో అవగాహన కల్పించినట్లు అన్సారీ తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!