ePaper
Friday, September 4, 2026

తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయమే లక్ష్యం: అశ్వద్ధామ రెడ్డి.

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తాం.
అశ్వద్ధామ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకుల పిలుపు

చీకటి వెలుగు నల్లగొండ.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ను విజయపథంలో నడిపించాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని రత్న ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ నలగొండ రీజినల్ సర్వసబ్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వదామా రెడ్డి పాల్గొని మాట్లాడారు.కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మజ్దుర్ యూనియన్తోనే సాధ్యమవుతుందని అన్నారు.పాత బకాయిలా నిధులు విడుదల లో తమ నాయకత్వం చేసిన పోరాటం కార్మికులు గమనించాలని అన్నారు. ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం లో మనమే కీలక పాత్ర వహిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ అభ్యర్థి అశ్వద్ధామ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని నాయకులు, కార్మికులను కోరారు.
యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని, కార్మికుల ఐక్యతతోనే సంస్థ మరింత బలపడుతుందని తెలిపారు. ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు మద్దతు తెలుపుతూ అశ్వద్ధామ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.నల్గొండ రీజినల్ పరిధిలోనీ 7 డిపోలలో విస్తృత ప్రచారం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకర్, జిల్లా అధ్యక్షులు తయ్యబ్, కార్యదర్శి శ్రీనివాస్, నిరంజన్, యాదయ్య, వీళ్ళ ప్రభాకర్, సుంకరి శ్రీనివాస్, కార్మికుల తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!