చీకటి వెలుగు నల్లగొండ.
రామగిరి బోయవాడలోని విద్యా నగర్ కాలనీ మహిళలు ఆషాఢ మాస గోరింటాకు పండుగను విద్యా నగర్ పార్క్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు చెట్టుకు పూజలు చేసి, గోరింటాకును చేతులకు అలంకరించుకుని ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.విద్యానగర్ పార్క్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న మహిళలందరికీ ఘనంగా భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బిగోని కవితా రమేష్, చికిలం సంధ్యారాణి, గాయత్రి, గోవిందమ్మ, పద్మ, రజనీ, లీలాదేవి, లక్ష్మి, ఉమ, సత్తెమ్మ, భవాని, రేణుక, నీలిమ, యాదమ్మ,విజయలక్ష్మి,రజిత, గీత,తులసి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments