ePaper
Sunday, September 6, 2026

ఆటోలతో కదిలిన కంచర్ల …కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన ర్యాలీ

బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి

చీకటి వెలుగునల్గొండ,

కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నల్గొండలో ఆటో ర్యాలీ నిర్వహించారు. నల్గొండ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 500కు పైగా ఆటోలు పాల్గొన్నాయి. నల్గొండ ఎన్జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్‌ విగ్రహం, రామగిరి, పద్మావతి కాలనీ, బస్టాండ్‌, మన్యం చిలక, సాగర్‌ క్రాస్‌రోడ్‌, పాతబస్తీ, రాష్ట్రపతి రోడ్డు మీదుగా జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో తమ వాహనాలతో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆటోపై కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డితోపాటు పలువురు నాయకులు స్వయంగా ఆటోలు నడుపుతూ కార్మికులను ఉత్సాహపరిచారు. ర్యాలీ సాగుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ప్రత్యేకంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందించి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చీరా పంకజ్‌యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, నల్గొండ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్‌, జమాల్‌ ఖాద్రి, కంచనపల్లి రవీందర్‌రావు, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్‌, మారగోని గణేష్‌, బాణావత్‌ దీప్లా, గోపగోని స్వాతి, రాజశేఖర్‌, దొడ్డి రమేష్‌, పెరిక యాదయ్య, పేర్ల అశోక్‌, రత్నగిరి శ్రీనివాస్‌, కుందూరి ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, రావుల శ్రీనివాసరెడ్డి, పల్లె రంజిత్‌, కంకణాల వెంకటరెడ్డి, గంజి రాజేందర్‌, మిర్యాల యాదగిరి, పెరిక కరణ్‌, జయరాజ్‌, దండంపెల్లి సత్తయ్య, రాపోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!