ePaper
Saturday, July 25, 2026

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దహనం

చీకటి వెలుగు నల్లగొండ,

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటనతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీనగర్‌లోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శిబిర కార్యాలయం నుంచి గడియార స్తంభం కూడలి వరకు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఢిల్లీలో రాహుల్ గాంధీపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడితో సమానమని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య, కనగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం అనుప్‌రెడ్డి, ప్రాంతీయ రవాణా సంస్థ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కేసాని వేణుగోపాల్‌రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, అల్లి సుభాష్ యాదవ్, ఖయ్యూం బేగ్, ఇబ్రహీం, గుండబోయిన వెంకన్న యాదవ్, ఖలీల్, సమద్, వజ్జ రమేష్ యాదవ్, ఇర్ఫాన్, మామిడి కార్తీక్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, దుబ్బ అశోక్ సుందర్, కరుణాకర్‌రెడ్డి, చిన్నాల జానయ్య, ప్రదీప్ నాయక్, సంకు ధనలక్ష్మి, కత్తుల కోటి, పాదం అనిల్‌కుమార్, వెంకన్న గౌడ్, ముజ్జు, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరికే, అంజయ్యతో పాటు పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!